మొక్కలు నాటిన వాటర్ వర్క్స్ MD దాన కిషోర్

396
Dana Kishore
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గోంటున్నారు. తాజాగా వాటర్ వర్క్స్ MD దాన కిషోర్ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా దాన కిషోర్ గారు మాట్లాడుతూ…. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 1) సత్యనారాయణ 2) శ్రీధర్ బాబు డైరెక్టర్ ప్రాజెక్టు2 3) HMWSSB అధికారులందరిని మొక్కలను నాటాలని కొరారు.

Dana Kishore

- Advertisement -