2001 తర్వాత ఇదే పెద్దదాడి..!

233
jawan
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందించారు. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విధుల్లోకి తిరిగొస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 39 మంది జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలో శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘాతుకం జరిగింది.

ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. 2001 తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం విశేషం. జమ్మూలో ఇంతపెద్ద ఎత్తున ఉగ్రదాడి జరగడం ఇదే తొలిసారి. ఉగ్రవాదుల దుశ్చర్యను రాష్ట్రపతి కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్య,ప్రధాని నరేంద్రమోడీ,కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్,తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఉగ్రదాడికి ప్రతీకార చర్య తీసుకుంటామని జమ్మూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

దాడికి పాల్పడింది తామేనని జైష్‌ ఎ మహ్మద్‌ సంస్థ ప్రకటించింది. 2001లో జమ్మూకశ్మీర్‌ శాసనసభపై కారు బాంబు దాడి తర్వాత ఆ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి.

2500 మందికిపైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోగా వీరు శ్రీనగర్‌ చేరుకోవాల్సి ఉంది. శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో అవంతిపురలోని లాతూమోడె వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే పేలుడు పదార్థాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం కాన్వాయ్‌లోని ఒక బస్సును ఢీ కొట్టింది. ఫలితంగా బస్సు తునాతునకలైంది. ఈ వాహనంలో 76వ బెటాలియన్‌కు చెందిన 39-44 మంది జవాన్లు ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు.

jammu updates jawan jammu kashmir terror attack

- Advertisement -