మొక్కలు నాటిన వాటర్ మాన్‌ ఆఫ్ సౌత్‌ ఇండియా

40
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌జోరుగా కొనసాగుతుంది. వాటర్ మాన్ ఆఫ్ సౌత్‌ ఇండియా క్రైసిస్ మాన్ ఆఫ్‌ ఇండియా అవార్డు గ్రహీత కరుణాకర్ రెడ్డి మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా వనపర్తి జిల్లా రంగాపురం గ్రామమంలో తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.

Also Read: కొలంబియా: అమెజాన్‌లో పసివాళ్లు ఏమయ్యారో..!

ఈ సందర్భంగా కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ….ఎంపీ సంతోష్‌తో కలిసి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కొన్ని కోట్ల మొక్కలు నాటించామని…రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Also Read: KTR:కరువునేలగా అల్లాడిన నేల.. దేశానికే బువ్వపెడుతుంది

- Advertisement -