ఆదిపురుష్ నుంచి క్రేజీ వార్త

57
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో రోజురోజుకు సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఆ పెరుగుతున్న ఆసక్తికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఓ కారణం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రెండు ఈవెంట్లు చేయ‌నుండ‌గా ఒక‌టి తిరుపతిలో, మ‌రొక‌టి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి హైద‌రాబాద్‌లో ఆది పురుష్ ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుందట. తిరుపతిలో జరిగే ఈవెంట్ లో ప్రభాస్ తో పాటు కొందరు యంగ్ హీరోలు కూడా ఈ ఈవెంట్ కి హాజరు అవుతారట. ఆదిపురుష్ సినిమా పై హైప్‌ ను మ‌రింత పెంచేందుకు ప్రీరిలీజ్ ఈవెంట్‌ చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఆది పురుష్ సినిమా నుంచి రిలీజైన ప్ర‌తీ కంటెంట్ ప్రేక్ష‌కులకు అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి.

Also Read: రీరిలీజ్‌ లో ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్‌

అన్నిటికీ మించి ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పౌరాణికం లుక్‌లో కనిపించనున్నారు. పైగా ఈ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ ప్రభాస్ భారీ యుద్ద సన్నివేశాలతో రాబోతున్నాడు. పైగా సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అలాగే, పక్కా రామ భక్తితో సాగే సినిమా ఇది, అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: శర్వా పెళ్లి వేడుకల్లో చరణ్ సందడి

- Advertisement -