ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న గోదావరి జల యాత్రలో భాగంగా ఈ రోజు ఖమ్మంలోని కవిత ఇంజనీరింగ్ కాలేజీలో, జల సంరక్షణ మరియు సామజిక బాధ్యత అనే అంశం సదస్సు కు వచ్చిన వాటర్ మెన్ అఫ్ ఇండియా డాక్టర్.రాజేందర్ సింగ్.. కళాశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను, నీటి కుంటలను పునరుద్దరించడం వలన, భూగర్భ జలంను పెంచడము ద్వారా పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ మరియు వృక్ష సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు.
అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. గత మూడు రోజులుగా నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో వాక్ ఫర్ వాటర్ అధినేత కరుణాకర్ రెడ్డి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంగం అధ్యక్షులు శ్యామప్రసాద్ రెడ్డి మరియు పద్మశ్రీ వనజీవి రామయ్య పాల్గొన్నారు.