‘భీష్మ’.. నీ నవ్వేమో సూపర్ క్యూటే సాంగ్‌..

343
Super Cute Video Song

యూత్ స్టార్‌ నితిన్ – క్యూట్ రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును విడుదల చేశారు. “నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ సూపర్ క్యూటే .. ఓ లుక్కుతోటి పెంచావే నాలో హార్టు బీటే ..” అంటూ ఈ పాట సాగుతోంది.

నితిన్ – రష్మికలపై విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకునేలా వుంది. పోస్టర్స్ వదిలిన దగ్గర నుంచే నితిన్ – రష్మిక జోడీ బాగుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస పరాజయాలతో వున్న నితిన్ కి ఈ సినిమా ఉత్సాహాన్నిస్తుందేమో చూడాలి.