- Advertisement -
శ్రీశైలంకు భారీగా వరద నీరు పోటెత్తింది. కర్నూల్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో సుంకేశుల, హంద్రీ నుండి వరద నీరు శ్రీశైలంకు చేరుకుంది. 14.464 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుకోగా ప్రస్తుత జలాశయం నీటిమట్టం 814.10.
ఇక నీటికాల్వ సామర్ధ్యం 214 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.76 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1.633 అడుగులుండగా ఇన్‌ఫ్లో ద్వారా 26వేల క్యూసెక్కులగా ఉండటంతో 286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
జూరాల ప్రాజెక్టుకు 1.709క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 7.817 టీఎంసీల నీరు ఉంది.
- Advertisement -