భారీగా పెరిగిన బంగారం ధర…

184
Gold Rate Today Live
- Advertisement -

పసిడి ధర పరుగులు పెడుతోంది. బంగారం ప్రియులకు షాక్‌ ఇస్తూ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. పదేళ్ల తర్వాత గరిష్టానికి బంగారం ధర చేరుకోగా హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 పెర‌గ‌డంతో.. రూ.51,460కు చేరింది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.47,180కు చేరింది. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెట్టింది. ఏకంగా రూ.1,880 పెరిగి రూ.51,900కు ఎగసింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి 47,900కు చేర‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.400 పెరిగి రూ.49,100కు చేరింది.

- Advertisement -