మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో ఏడుపాయలకు వరద ఉధృతి తగ్గలేదు. వనదుర్గా భవానీ దేవస్థానం వద్ద ఆరు రోజులుగా భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది.అమ్మవారి గర్భాలయ దర్శనం నిలిపివేశారు ఆలయ అధికారులు.
నదీ పరివాహక ప్రాంతాల్లో SDRF సిబ్బందితో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు మాత్రం చేస్తున్నారు.
హిమాయత్ సాగర్‌కు స్వల్పంగా తగ్గింది వరద ప్రవాహం. ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా వరద రావడంతో రెండు గేట్లను మూడు ఫీట్ల ఎత్తుతో నీటిని బయటికి వదిలారు జలమండలి అధికారులు.లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.
Also Read:మురళి నాయక్..బయోపిక్
ఇక మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోండగా ఇన్ ఫ్లో- 39009 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో- 43466 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలుకాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 19.534 టీఎంసీలుగా ఉంది.

