ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సాధిస్తున్న పురోగతిని పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో పోలుస్తూ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రస్తావించారు. ఐపిఎల్‌లో రెండు అద్భుతమైన సీజన్ల తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. రెండు లీగ్‌లలోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న అక్రమ్, ఐపిఎల్ తరహాలో కొత్త ప్రతిభను వెలికితీయడంలో పిఎస్ఎల్ విఫలమైందని విమర్శించారు.
అక్రమ్ 2010 నుండి 2017 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా, మెంటార్‌గా వ్యవహరించి రెండు ఐపిఎల్ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పిఎస్ఎల్ లో ఆయన ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ జట్లకు సేవలు అందించారు.
యూట్యూబర్ ఫుర్కాన్ భట్టితో జరిగిన ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడుతూ…పిఎస్ఎల్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయింది, కానీ ఈ లీగ్ ద్వారా ఒక్క నాణ్యమైన బ్యాటర్ అయినా వెలుగులోకి వచ్చారా? కొందరు బౌలర్లను తయారుచేసి ఉండవచ్చు, కానీ గుర్తించదగిన బ్యాటింగ్ ప్రతిభను ఏమైనా అందించామా? భారత 14-15 ఏళ్ల యువకుడి (సూర్యవంశీ) లాంటి బ్యాటింగ్ టాలెంట్‌ను మనం తయారుచేసినప్పుడే మన వద్ద మార్పు, పురోగతి కనిపిస్తాయి అని పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో కొత్త ప్రతిభను వెలికితీయడానికి మరియు పిఎస్ఎల్ ప్రమాణాలను పెంచడానికి క్లబ్ క్రికెట్ సంస్కృతిని పునరుద్ధరించాలని ఈ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ సూచించారు. రెడ్ బాల్ క్రికెట్‌లో మార్పు రావాలంటే క్లబ్ క్రికెట్‌ను బాగుచేయాలి. కరాచీ, లాహోర్‌లలో పిసిబి చెరో 100 మిలియన్ రూపాయలు ఖర్చు చేయాలి, ఎందుకంటే అసలైన ప్రతిభ క్లబ్ క్రికెట్ నుంచే వస్తుంది అన్నారు.
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు విషయానికొస్తే, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో బాబర్ ఆజమ్ బృందం వైట్‌వాష్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయిన పాకిస్తాన్, బిర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ ఘోర ఓటమి అంచున నిలిచింది.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

