కిమ్ కర్దాషియన్‌ను రేప్‌ చేశారా..?

261
Was Kim Kardashian raped ?
Was Kim Kardashian raped ?
- Advertisement -

కిమ్‌ కర్దాషియన్‌.. నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు. తన న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాను పిచ్చేక్కిస్తుంది. తనకున్న ఫాలోయింగ్‌ కూడా పెద్దదే.. తనను ఎంతో ఆదరిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణం తీర్చుకుంటూనే ఉంటానని కిమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా నెటిజన్లను తన బుట్టలో వేసుకొని బాగానే సంపాందించింది ఈ సెల్ఫీ క్వీన్. అయితే అలాంటి ఈ భామనే మస్కా కొట్టి దోచుకున్నారు పారిస్‌ దొంగలు.

MAIN-Kim-Kardashian

పారిస్ లో జరుగుతున్న ఓ ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన కిమ్ కర్దాషియన్ నుంచి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 67 కోట్లు) విలువైన నగలను దోచుకెళ్లారు దొంగలు. పోలీసు అధికారుల వేషంలో వచ్చిన సాయుధులైన ఐదుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారని ఆమె ప్రతినిధి తెలిపారు. కిమ్ పడక గదిలోకి దూసుకొచ్చిన వారు, దోపిడీ అనంతరం సైకిళ్లపై పారిపోయారని వివరించారు. ఆ సమయంలో కిమ్ బాడీగార్డు పాస్కల్ దువీయర్ అక్కడ లేరని, పారిస్ నైట్ క్లబ్ కు వెళ్లిన కిమ్ చెల్లెలికి రక్షణగా అక్కడుండి పోయారని తెలిపారు.

elite-daily-kim-kardashian

ఈ ఘటన జరిగిన తరువాత అమెరికా చేరిన ఆమె, తన భర్త కేన్యీ వెస్ట్ తో కలసి దోపిడీపై ఫిర్యాదు చేసింది. తన నుంచి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 67 కోట్లు) విలువైన నగలను దోచుకెళ్లారని తెలిపింది. 4.5 మిలియన్ డాలర్ల విలువైన ఉంగరం, 5.6 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలున్న బాక్స్, రెండు మొబైల్ ఫోన్లు పోయాయని తెలిపింది. బెడ్‌ రూమ్‌లో ఉన్న తనను తాళ్లతో కట్టేసి దోచుకెళ్లినట్లు కిమ్ పోలీసులకు తెలిపింది.  అయితే కిమ్‌పై రేప్ జరిగినట్లు అమెరికన్ మీడియాలో కొన్ని వార్తలోచ్చాయి. దీనిపై స్పందించడానికి కిమ్ నిరాకరించింది. ఏది ఎలా ఉన్న కిమ్‌కు తన కంటే తన డబ్బు.. బంగారమే ముఖ్యం కదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న న్యూయార్క్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -