ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్..!

62
aadi sai kumar
- Advertisement -

డిఫరెంట్ రేంజ్ లో,డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో సిద్ధం అయ్యారు. హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 10 ని నిర్మాత ఈరోజు ప్రకటించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు గా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ”అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ నన్ను సంప్రదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆది సాయికుమార్ ఈ సబ్జెక్ట్ కి సరిగ్గా సరిపోతారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి బాగా వస్తోంది. ఈ చిత్రానికి సరైన తారాగణం మరియు సాంకేతిక సిబ్బంది సెట్ అయ్యారు అని పేర్కొన్నారు.

సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు. జి సత్య ఈ చిత్రానికి ఎడిటర్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తారాగణం: ఆది సాయికుమార్
సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కెకె రాధామోహన్
రచయిత, దర్శకుడు: ఫణి కృష్ణ సిరికి
సంగీతం: ధ్రువన్
డిఓపి: సతీష్ ముత్యాల
ఎడిటర్: జి సత్య
కళ: కె రమేష్
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు
PRO: వంశీ-శేఖర్

- Advertisement -