సర్పంచ్ ఎన్నికలో జాక్‌పాట్!

2
- Advertisement -

వరంగల్ జిల్లా, సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో ఒక మహిళ అదృష్టం తలుపు తట్టింది. ఈ గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో, ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా ఓటరు అయిన కొంగర మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

ఆశాలపల్లి పంచాయతీలో మొత్తం 1,600 మందికి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, రిజర్వేషన్ కారణంగా మల్లమ్మ ఒక్కరే పోటీ చేయడానికి అర్హత సాధించారు. దీంతో ఆమె నామినేషన్ వేయగా, మరో అభ్యర్థి పోటీకి లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఆమె ఎన్నికైన తర్వాత ఇప్పుడు గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రామానికి సర్పంచ్ అయినందున, మల్లమ్మను తమ తమ పార్టీలలో చేర్చుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ అనూహ్య విజయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:BB9: చివరి కెప్టెన్‌గా కళ్యాణ్

- Advertisement -