మొక్కలు నాటిన వరంగల్ రూరల్ జేసీ మహేందర్ రెడ్డి

473
Jc Mahendar Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ రోజు రోజూకు విస్తరిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో ఆ తర్వాత సినీ,రాజకీయ,క్రీడ, ప్రభుత్వ, ప్రయివేటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు,అధికారులు తమ వంతు బాధ్యత గా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ ని విసురుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ ను సామాజిక బాధ్యత గా ప్రతీ ఒక్కరు అన్వయించుకుంటున్నారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని వరంగల్ రూరల్ జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి స్వీకరించారు. ఈసందర్భంగా తన క్యాంప్ ఆఫీస్ లో మూడు మొక్కలు నాటారు. .అనంతరం కామారెడ్డి jc, వరంగల్ dro, పరకాల rdo లకు గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు.

అనంతరం జేసీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్ర లో అశోకుడు మొక్కలను నాటాడు అని విన్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరము మొక్కలు నాటాలని,తద్వారా కలిగే ప్రయోజనాలను మన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలియచేసారన్నారు. మొక్కలను నాటే కార్యక్రమం బాధ్యత తో పాటు మరొకరికి స్ఫూర్తిగా ఉండేలా చేసే ప్రతీ పనిలో ఉత్సాహం కలిగేలా mp సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఎంతో దోహదపడుతుందన్నారు. మాములుగా మొక్కలను నాటాడమే కాకుండా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం వినూత్నంగా ఉందన్నారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున మరో తొమ్మిది మందికి ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రమంత విస్తరింప చేసేలా చేస్తున్న mp సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -