- Advertisement -
పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాళ్టి నుండి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న నామినేషన్ల పరిశీల,13న ఉపసంహరణకు చివరి తేదీ.
27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉండనుండగా జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ములుగు జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని ఈసీ తెలిపింది.
కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పేరు పరిశీలిస్తుండగా బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read:ఈ ఆసనాలతో గుండెపోటు కు చెక్..!
- Advertisement -