HarishRao:వరంగల్ ఇజ్ మెడికల్ సిటీ

34
- Advertisement -

వరంగల్‌ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుతో మెడికల్ నగరంగా అభివృద్ధి చెందిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో వైద్యకళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎంపీ దయాకర్‌, మేయర్‌ సుధారాణితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఫాదర్ కొలంబో కల నేడు నెరవేరిందని అన్నారు. 60 యేళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే..తొమ్మిదేళ్లలో ఆ సంఖ్య 21కి చేరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాడు ప్రభుత్వ ప్రైవేటులో మొత్తం 20మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కి చేరాయన్నారు. ఎంబీబీఎస్ సీట్లు కూడా 2950 నుంచి 8340కి పెరిగినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కుల మతాలకీతతంగా సేవలు అందిస్తున్నారని అన్నారు.

Also Read: మొక్కలు నాటిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

భూపాపల్లి జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని త్వరలో ములుగులో మెడికల్‌ కాలేజీ కూడా వస్తుందన్నారు. వరంగల్ హెల్త్‌ సిటీ నిర్మాణం రూ.1100కోట్లతో జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీ వస్తే 500పడకల ఆసుపత్రి వస్తదని దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Also Read: బలపడుతున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీకి సై

- Advertisement -