కొండా మురళిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? చెప్పాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. మా నియోజకవరగాల్లో అతని డామినేషన్ ఏంటి? … టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ ముందు అసహనం వ్యక్తం చేశారు వరంగల్ కాంగ్రెస్ నాయకులు.
వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కొండా మురళి చేసిన వ్యాఖ్యల పట్ల విచారణ జరుపుతోంది టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ. ఈ నేపథ్యంలో గురువారం గాంధీ భవన్‌లో వరంగల్ కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు రికార్డు చేసింది కమిటీ.
కొండా మురళికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకటరమణ రెడ్డి. కొండా మురళిపై చర్యలు ఉంటాయా ఉండవా? మేము పార్టీ మారడం నిజమే కానీ వారిలాగా అన్నీ పార్టీలు తిరగలేదని తెలిపారు.
Also Read:బీసీ రిజర్వేషన్లు..చిత్తశుద్ది నిరూపించుకోవాలి
కొండా మురళి తమపైన బహిర్గతంగా వ్యాఖ్యలు చేస్తే, తమనే కమిటీ ముందుకు పిలవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. మా నియోజకవర్గాల్లో కొండా కుటుంబం జోక్యం ఎక్కువైందని కమిటీకి తెలిపారు. కొండా కుటుంబంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం పడుతుందని కమిటీకి సూచించారు.

