42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అన్నారు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.
2018 చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది అని… ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్ ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నాం అన్నారు. ఇందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.కామారెడ్డి డిక్లరేషన్‌ను నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్రం ఆర్డినెన్స్ జారీ చేసింది.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని అభినందించాలి అన్నారు.
Also Read:సాగునీటి గోస..కాంగ్రెస్‌దే పాపం!

