పవన్‌,ఎన్టీఆర్‌ ఇద్దరికీ ఒకే రోజు కావాలట…!

180
War Between Pawan Kalyan and Junior NTR At Box-Office
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  ఇప్పుడు బాక్సాఫీస్‌ వార్‌ కి  సై అంటున్నారు. వీరికి ఇప్పటికే అభిమానుల్లో ఫుల్ క్రేజ్‌ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం వీరు బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు బరిలో దిగుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటించనున్నాడన్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా పట్టాలెక్కేది మాత్రం  ‘కాటమరాయుడు’ తర్వాతే.

అయితే కాటమరాయుడు ఇప్పడు శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 24న రిలీజ్ కానుంది.  ఈ సినిమా తర్వాత  పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మొదలవుతుంది. కానీ…ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళని ఈ చిత్రాన్ని ఆగష్టు11న రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.
 War Between Pawan Kalyan and Junior NTR At Box-Office
కాగా అదే రోజున యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా కూడా రిలీజ్ కానుందని నందమూరి సన్నిహితులు చెబుతున్నారు. ఆగష్టు రెండో వారం నుంచి సెలవులు ఎక్కువగా వస్తుండడంతో ఆగస్టు 11వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దీన్ని బట్టి చూస్తుంటే పవన్‌, ఎన్టీఆర్‌ సినిమాలు ఒకే రోజు సందడి చేస్తాయన్నమాట. ఇక ఈ సినిమాల కోసం ఇప్పటి నుంచే అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యంగ్‌ టైగర్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక పవన్‌.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజంటే ఫ్యాన్స్ కి మాత్రం పండగే. మరి చూద్దాం బాక్సాఫీస్ బరిలో ఎవరు గెలుస్తారో..!

- Advertisement -