వార్‌ 2..క్రేజీ అప్‌డేట్!

23
- Advertisement -

ఆర్ఆర్ఆర్‌ తో గ్లోబల్ స్టార్‌ గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటిగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ ఈ క్రేజీ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్ చక్కర్లు కొడుతోంది.

హృతిక్, తారక్ ల నడుమ ఓ క్రేజీ పాటని డిజైన్ చేస్తున్నారని టాక్. డ్యాన్స్‌కి కేరాఫ్ ఎన్టీఆర్, హృతిక్. అలాంటిది ఇద్దరూ ఒకేసారి కలిసి డ్యాన్స్ చేస్తే కన్నుల పండగే. మొత్తంగా వార్ 2 అభిమానులకు కనువిందు కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:యుఎస్‌లో ఆగని టిల్లు సునామీ

- Advertisement -