వక్ఫ్ బిల్లుకు లోక్ సభ అమోదం

22
- Advertisement -

12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లును అమోదించింది కేంద్రం. బిల్లుకు అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా, 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఇవాళ రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు రానుంది.

ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైసీపీ సైతం బిల్లను వ్యతిరేకించింది.

ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా చెబుతారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విస్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను సమర్థంగా, పారదర్శంగా కొనసాగించటానికి యత్నిస్తున్నామని తెలిపారు.

వక్ఫ్‌ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. రాజ్యాంగాన్ని నీరుగార్చడం (డైల్యూట్‌), మైనారిటీలను అప్రతిష్ఠ పాల్జేయడం (డిఫేమ్‌), సమాజాన్ని విభజించడం (డివైడ్‌), ముస్లింల హక్కులను హరించడం(డిసెన్‌ఫ్రాంఛైజ్‌) అనే నాలుగు (4డి) లక్ష్యాలతోనే బిల్లును తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు.

Also read:బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కేసీఆర్ సమావేశం

- Advertisement -