- Advertisement -
వక్ఫ్ సవరణ చట్టం నేటి నుండి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గత వారం ఉభయసభలూ ఈ సవరణ బిల్లును ఆమోదించగా ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేశారు.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ చట్టం ఏప్రిల్ 8 నుండి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. అలాగే న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఏప్రిల్ 4న రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. లోక్ సభలో 288 మంది సభ్యులు బిల్లుకు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
Also Read:రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం:పొంగులేటి
- Advertisement -

