వీరయ్య ఊహించని రికార్డులు

87
- Advertisement -

సంక్రాంతి పోటీలో విజేతగా నిలిచిన వాల్తేరు వీరయ్య కొన్ని చోట్ల సాధించిన రికార్డులు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రొటీన్ ఎంటర్ టైనర్ అనే టాక్ వచ్చినప్పటికీ వింటేజ్ మెగాస్టార్ జనాన్ని రప్పించిన తీరు భారీ వసూళ్లను తెచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి రికార్డులు ఏవైనా నాన్ ఎస్ఎస్ఆర్ (రాజమౌళి) పేరుతో పరిగణించి విడిగా లెక్కేయడం చూస్తున్నాం. వరల్డ్ వైడ్ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. జక్కన్నని దాటడం అసాధ్యమని తేలిపోవడంతో ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలకు ఇలా ఫాలో కావడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.

విషయానికి వస్తే ఏపీ తెలంగాణ సింగల్ స్క్రీన్లలో అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ సాధించిన సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. వైజాగ్ జగదాంబలో కేవలం 22 రోజులకే (మార్నింగ్ షోకి) ఈ ఫీట్ ని అందుకుంది. ఇది గతంలో ఇదే థియేటర్లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు (23 రోజులు) పేరిట ఉంది. హైదరాబాద్ తో సహా ఇంకెక్కడా ఇంత ఫాస్ట్ గా నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు ఎవరికి లేదు. ఆర్ఆర్ఆర్ దేవి 70 ఎంఎంలో 12 రోజులకు, సుదర్శన్ 35 ఎంఎంలో 17 రోజులకు కోటి రాబట్టింది జగదాంబలో 16 రోజులకే సాధ్యమయ్యింది. సో రాజమౌళిని అందుకోవడం ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చినట్టే కనిపిస్తున్న వాల్తేరు వీరయ్యకు బాక్సాఫీస్ వద్ద అన్ని అంశాలు బాగా కలిసి వస్తున్నాయి. దీని తర్వాత విడుదలైన హంట్, మైఖేల్ లాంటివి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. రైటర్ పద్మభూషణ్ కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బిసి సెంటర్స్ లో మరీ విపరీతమైన ప్రభావం కనిపించటం లేదు. అందుకే వీకెండ్స్ మళ్ళీ వీరయ్య కంట్రోల్ లోకే వెళ్తున్నాయి. పఠాన్ దూకుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. మొదట్లో చూపించిన స్పీడ్ ఇప్పుడు లేదు. 10న వచ్చే కళ్యాణ్ రామ్ అమిగోస్ ఈ పరిస్థితిలో మార్పుతో పాటు జోష్ తీసుకొస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -