డిసెంబర్‌ 12న…రవితేజ ఫస్ట్‌లుక్‌

137
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి భారీ అంచనాలు వున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి.

ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ గురించి అప్‌ డేట్ వచ్చింది. రవితేజ ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయడానికి మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. “మాస్ ఈజ్ కమింగ్” అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌ లో లీడ్‌ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అవతార్‌-2 అడ్వాన్స్ రికార్డు….

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కి హీరోలు లేరా ?

పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వెనుక రహస్యం !

- Advertisement -