వైజయంతి మూవీస్…’మే’ సెంటిమెంట్

282
ashwinidutt
- Advertisement -

టాలీవుడ్‌లో హిట్ సినిమాలకు కేరాఫ్ బ్యానర్ వైజయంతి మూవీస్. ఎంతో మంది హీరోలు ఈ బ్యానర్‌ ద్వారా ఇండస్ట్రికి పరిచయం కాగా తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది వైజయంతి మూవీస్.

ఇక వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఎన్నో క్లాసికల్,యాక్షన్,కామెడీ సినిమాలు తెరకెక్కగా వాటిలో మే నెలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.ఈ నెలలో తెలుగు తెరకు అపూరప చిత్రాలను అందించింది ఈ బ్యానర్.

సరిగ్గా 30 ఏళ్ల క్రితం మే 9న చిరంజీవి హీరోగా నటించిన జ‌గ‌దేకవీరుడు అతిలోకసుంద‌రి హిట్ 2018 మే 9న మ‌హాన‌టి , 2019 మే 9న మ‌హ‌ర్షి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువచ్చింది. ఈ మూడు చిత్రాలు మే 9నే విడుదలయ్యాయి. మొత్తంగా వైజయంతి బ్యానర్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం.

- Advertisement -