బత్తాయి రైతులను ఆదుకుందాం: ఎంపీ సంతోష్

84
santhosh

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు, “తెలంగాణ బత్తాయి డే’ కార్యక్రమంను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీస్టేడియంలో ఈ నెల 10న 500 మంది క్రీడాకారులకు బత్తాయిలు పంపిణీ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన వార్తను ట్విట్టర్‌లో షేర్ చేశారు ఎంపీ సంతోష్. బత్తాయి రైతులను ఆదుకునేందుకు అంతా ముందుకురావాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. మే 10న నిర్వహించే “తెలంగాణ బత్తాయి డే”ని పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లను కొనుగోలు చేయాలన్నారు.