యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. మధురం

12
- Advertisement -

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.

సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘‘మధురం’ ట్రైలర్ చాలా బాగుంది. టీనేజ్ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్​బ్యాక్‌ గుర్తొచ్చింది. 2008లో నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ. ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్లు తర్వాత రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్ చూశాక ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తే బంగార్రాజు లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు. టీమ్ అందరికీ గుడ్ లక్’’ అని అన్నారు.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ ‘‘ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో.. అంతే చక్కని టీమ్ కుదిరింది. హీరో ఉదయ్, హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించారు. కెమెరామేన్ మనోహర్ గారు మంచి విజువల్స్ అందించారు. వెంకీ వీణ సంగీతం అందర్నీ అలరిస్తుంది. ప్రొడ్యూసర్ బంగార్రాజు గారు చేసిన సపోర్ట్‌తో బెస్ట్ అవుట్‌పుట్ వచ్చింది. అలాగే నాకు సహకరించిన టీమ్‌కు, ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి థ్యాంక్స్”అని చెప్పారు.

హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ..”ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులోని నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అని చెప్పారు.

- Advertisement -