వివి వినాయక్ మంచి దర్శకుడు. ఒకప్పుడు టాప్ పొజిషన్ కు చేరుకున్నవాడు. కానీ ఆ తరువాత సరైన కథ, కథనాలు మిస్ చేసుకుని ఎక్కడో కిందకు జారిపోయాడు. ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చినా మిస్ ఫైర్ చేసకున్నాడు. కారణాలు ఏమైనా కానీ.. వివి వినాయక్ నుంచి క్వాలిటీ సినిమా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మరొసారి వివి వినాయక్ మెగాఫోన్ పట్టబోతున్నట్లు వినిపిస్తోంది.
వెలిగొండ శ్రీనివాస్ రాసిన ఓ కథను పట్టుకుని, వినాయక్ నిర్మాతలు, హీరోలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత బెల్లంకొండ బుజ్జి, వివి వినాయక్ తో ఏదైనా మంచి ప్రాజెక్టు చేయాలని చూస్తున్నారు. హీరో రవితేజ డేట్ లు ఆయన దగ్గర వున్నాయి. అందుకే ఇప్పుడు వెలిగొండ శ్రీనివాస్ చేసిన కథను రవితేజకు చెప్పి ఒప్పించి, బెల్లకొండ బుజ్జి నిర్మాణంలో సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి హీరో రవితేజ ను కథతో దాదాపు ఒప్పించారని తెలుస్తోంది. కథ ఫైన్ ట్యూన్ చేయడం వంటి పనులు పూర్తయితే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. ప్రస్తుతం రవితేజ చేతిలో కూడా రెండు మూడు సినిమాలు వున్నాయి. పైగా ధమాకా రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టాక్ ను బట్టి కూడా వినాయక్ – రవితేజ సినిమా డిసైడ్ కానుంది.
ఇవి కూడా చదవండి…