విక్టరీ వెంకటేశ్ తో వివి వినాయక్

444
Venkatesh-VV-Vinayak
- Advertisement -

స్టార్ దర్శకుడు వివి.వినాయక్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీకి శీనయ్య అనే టైటిల్ ను ఖారారు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాకు నరసింహ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో వినాయక్ రైతు పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా వినాయక్ హీరో వెంకటేశ్ కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కె సినిమా కోసం సిద్దమవుతున్నాడు వెంకటేశ్. ఈసినిమా పూర్తైన తర్వాత వెంకటేశ్ తో సినిమా చేయనున్నాడు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ తో వచ్చిన లక్ష్మీ మూవీ భారీ విజయం సాధించింది. వినాయక్ దర్శకత్వం వహించిన చివరి మూవీ ఇంటెలిజెంట్. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈమూవీ భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది.

- Advertisement -