రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే 105 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించిన కేసీఆర్…మరో రెండు రోజుల్లో రెండో జాబితాను కూడా ప్రకటించనున్నారు. విపక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. గ్రామాలు,పట్టణాల్లో ప్రజల నుంచి ఉహించని మద్దతు లభిస్తోంది. పలు గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తున్నారు.
తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రైతు పోడేటి భూమయ్య మా ఓటు టీఆర్ఎస్‌కే అంటూ ఇంటిగోడపై రాయించాడు. అంతేగాదు టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేస్తున్నామో వివరించారు.
A farmer called ‘Podeti Bhumaiah’ of Ibrahimpatnam Mandal in Korutla constituency of Jagityal district has painted his walls listing out the reasons why he will vote for @trspartyonline candidate VidyaSagar Rao 👍#RythuBandhu#KalyanaLakshmi#kantivelugu #AasaraPension pic.twitter.com/GyVzbaP74R
— KTR (@KTRTRS) September 13, 2018
()మా భూమి ఎకరాకు రూ. 4 వేలు పెట్టుబడి సహాయం అందించినందుకు
()24 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నందుకు
()వెయ్యి రూపాయాలు ఆసరా పెన్షన్ ఇస్తున్నందుకు
()కల్యాణలక్ష్మీతో పాటు మా కోడలికి అండగా నిలిచినందుకు
()కంటి వెలుగుతో మా దంపతుల కళ్ళను కాపాడినందుకు…ఇలా రాసుకుంటూ పోతే నా గోడ సరిపోదు.. నాకే కాదు.. ఇలా అందరికి అండగా ఉన్న ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నాము! అందుకే మా కుటుంబం ఓట్లు కారు గుర్తుకు మాత్రమే వేయబడును అని రాయించాడు. టీఆర్ఎస్‌కే ఓటు వేస్తామంటూ రైతు రాసిన వార్త ఫోటోను షేర్ చేశారు కేటీఆర్. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.