విద్వేషపూరిత వ్యాఖ్యలను నమ్మి మోసపోకండి: కవిత

162
kavitha
- Advertisement -

మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్య‌లు చేస్తున్న వారి మాట‌లు న‌మ్మి మోసపోవ‌ద్ద‌ని సూచించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. కొంద‌రు న‌గ‌రంలో మ‌త సామ‌ర‌స్యాన్ని చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, తాము అందుకు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌బోమ‌ని ఆమె తేల్చిచెప్పారు.

హైద‌రాబాద్ న‌గ‌ర యువ‌తకు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు ఎవ‌రికి వేయాలో నిర్ణ‌యించుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఒక కులం కోస‌మో, ఒక మ‌తం కోస‌మో, ఒక ప్రాంతం కోసమో జరుగుతున్న‌వి కాద‌ని.. హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని క‌విత చెప్పారు.

- Advertisement -