మొక్కలు నాటిన డాక్టర్ వైబి రమేష్..

75
green challange

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజు మరియు తన సోదరుడి కుమారుడు ఆదిత్య పుట్టినరోజును పురస్కరించుకొని నేడు కర్ణాటకలో తన కుటుంబ సభ్యులతో కలిసి 21 మొక్కలు నాటారు డాక్టర్ వైబి రమేష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరం బాధ్యతగా తీసుకోవాలని.. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 21 మొక్కలను మా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

మొక్కలు నాటడం వల్ల చాలా సంతోషంగా ఉంది అని ఈ పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.