టీఆర్ఎస్‌కు ఓటేస్తే..కాళేశ్వరం నీళ్లు

302
mp kavitha harish rao
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది టీఆర్ఎస్. మెదక్ పార్లమెంట్ పరిధిలో మంత్రి హరీష్..నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి ఎంపీ కవిత విస్తృత ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత రాబోయే రెండేళ్లలో ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని చెప్పిన కవిత స్వంత భూమి కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందని తెలిపారు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 2800 కోట్లు కేటాయించామన్నారు.ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనం పథకం ద్వారా నిజామాబాద్‌లోని ప్రతి గ్రామంలో చెరువులు నింపుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలపించాలని ప్రజలను కోరారు.

కారు గుర్తుకు ఓటేస్తేనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మెదక్ ఎంపీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి నంగునూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపి రైతు బంధువుగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. మెదక్ ఎంపీ స్ధానాన్ని 5 లక్షల మెజార్టీతో గెలిచి తీరుతామన్నారు.

ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనని సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి అన్ని నియోజకవర్గాల్లో లక్ష మెజార్టీ ఇస్తామని ఎమ్మెల్యేలంతా పోటీపడుతున్నారని తెలిపారు. సిద్దిపేటకు పాస్ పోర్టు కేంద్రం తెచ్చినా, జాతీయ రహదారి మంజూరు చేయించినా ఆ ఘనత ప్రభాకర్ రెడ్డిదే అన్నారు.ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -