గ్యాస్‌కు దండం పెట్టి…కారుకు ఓటేయండి

143
Harishao
- Advertisement -

గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు మంత్రి హరీశ్ రావు కోరారు. మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌…15 రోజుల నుండి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు. మనకు అన్నం పెట్టినోడుఎవరో…సున్నం పెట్టేటోడు ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

బీజేపీ బట్టెబాజ్ గాళ్ల మాటలు వింటే గోస పడతరాని…కేసీఆర్ మనుగోడుకు వచ్చిన తర్వాత బీజేపీవాళ్లు జబ్బలు జార విడిచిండ్రు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయంమైందన్నారు. ఎంత మందికి ఓట్లు వేసినం..బీజేపీకి,కాంగ్రెస్. టీడీపీకి ఓట్లువేసినం. కాని గతంలో మంచి నీళ్లు గోస ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకోవాలన్నారు.

ఇవాళ ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ ను సాదుకోవాలా…చంపుకోవాలా..మీరే ఆలోచించాలన్నారు. మా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిండి..నల్లాల ద్వారా ఇంటింటికి నీళ్లు ఏలా ఇచ్చామే…మీ పొలాలకు కాలువల ద్వారా నీళ్లు ఇస్తం అన్నారు. బీజేపీ పార్టీతో మాట్లాడుకుని రాజ్ గోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నరు. ఇది స్వయంగా రాజగోపాల్ చెప్పుకున్నరు. ఆరు నెలల కింద నాకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అని… బీజేపీ వాళ్లను సంతోషపెట్టేందుకు రాజీనామా చేశారన్నారు.

రైతు బంధు ఇచ్చిండ్రు..రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బీమా ఇచ్చిండ్రు. ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లక్షరూపాయలు వస్తలేవా.. కేసీఆర్ సారును మర్చిపోదామా..కోడలు కాన్పుకు పోతే ప్రభుత్వ దవాఖానాకు..కేసీఆర్ కిట్ ఇవ్వడంలేదా అన్నారు.

ఇవి కూడా చదవండి..

పెళ్లిపీటలెక్కనున్న హన్సిక.. వరుడు ఎవరంటే ?

హ్యాపీ బర్త్ డే..ఇలియానా

కారుదే గెలుపు..ఆర్ఎస్ఎస్ షాకింగ్ సర్వే!

- Advertisement -