రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ జెర్సీని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా MLA లు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డా. అబ్రాహాము గార్లతో కలసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో MD బేస్‌లైన్ వెంచర్స్, తుహిన్ మిశ్రా మరియూ టీమ్ ఓనర్‌లతో కూడిన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ బృందం, హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు చెందిన మిస్టర్ అభిషేక్ రెడ్డి మరియు బెంగళూరు టార్పెడోస్‌కు చెందిన యశ్వంత్ బియ్యాల పాల్గొని మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించారు.
A23 ద్వారా ఆధారితమైన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఏడు నగర ఆధారిత ఫ్రాంచైజీలు – కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్ మరియు కోల్‌కతా థండర్‌బోల్ట్స్ హైదరాబాద్‌లో ఒకే రౌండ్-రాబిన్ ఫార్మాట్ వాలీబాల్ లీగ్‌లో పోటీపడతాయి. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మొత్తం 24 మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.