వొడాఫోన్ సరికొత్త ఆఫర్‌..

263
- Advertisement -

రిల‌య‌న్స్ జియో సంస్ధ‌ కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియెగ‌దారుల‌ను అట్రాక్ట్ చేస్తుంది. త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ ఇవ్వ‌డంతో పాటు కొత్త కొత్త ప్లాన్ ల‌ను విడుద‌ల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్ర‌స్తుతం జియో టాప్ నెంబ‌ర్ 1 లో కొన‌సాగుతుంది. జియో పోటీని ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. టెలికాం సంస్థ వొడాఫోన్ జియోకు పోటీగా ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

Vodafone New Prepaid Offer

వొడాఫోన్ రూ.199 కే 2.8 జీబీ 4జీ డేటాతో వినియోగదారులకు అందించనుంది. రూ.198కే అపరిమిత కాల్స్‌తో పాటు ప్రతి రోజూ 2 జీబీ 4జీ డేటాను అందిస్తున్న జియోకు పోటీగా.. వొడాఫోన్ ఈ సరికొత్త ప్లాన్ రూపొందించింది. గతంలో 199 రూపాయలకు 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.4 జీబీ 4జీ డేటాను వొడాఫోన్ అందించింది. ప్రస్తుతం అదే ధరకు రెట్టింపు సేవలు అందించనుంది.

ఇప్పటికైతే ఈ ఆఫర్ అన్ని 4జీ సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలలోని కస్టమర్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. జియో తన 198 ఆఫర్‌ను వెల్లడించిన తర్వాతే వొడాఫోన్ తన పాత ప్లాన్‌పై ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

- Advertisement -