మంత్రి కేటీఆర్‌ను కలిసిన మమ్ముట్టి..!

244
Mammooty meets KTR
- Advertisement -

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుని ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షిప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు.

Mammooty meets KTR

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలపైన మమ్ముట్టి ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ పథకంపైన మమ్ముట్టి ప్రశంసలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం శబరిమల దేవస్థానం వద్ద కేరళ ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న పలు కార్యక్రమాలతో పాటు, తెలంగాణలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రి మమ్ముట్టికి తెలిపారు.

- Advertisement -