నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..

221
Vladimir Putin wins by big margin
- Advertisement -

నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వ్లాదిమిర్ పుతిన్. ఆదివారం జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు పడినిట్లు ఆదేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో ఆయన 2024 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ సారి స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగిన పుతిన్‌కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.

పుతిన్‌తో పాటు ఏడుగురు అభ్యర్ధులు బరిలో దిగగా న్యాయపరమైన కారణాలతో అలెక్సీ నావల్నీ బరిలోనుంచి తప్పుకున్నారు. పుతిన్‌ సమీప ప్రత్యర్ధి కమ్యూనిష్టు పార్టీ అభ్యర్ధిగా ఉన్న పావెల్ గృడీనిన్ సుమారు 11 శాతం ఓట్లను సాధించాడు. 1999లో తొలిసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్‌ స్టాలిన్ తర్వాత రష్యాను సుదీర్ఘ కాలం పరిపాలించిన నేతగా నిలిచారు.

పుతిన్ ఏం చేసిన ప్రత్యేకమే. పుతిన్ ఉదయం చాలా లేటుగా మేల్కొంటారు. మధ్యాహ్నం టిఫిన్ చేసే ఆయన ఆహారంలో ఒక కప్పు ఓట్‌మీల్‌‌తో పాటు ఒక పెద్ద ఆమ్లెట్ , గుడ్డు, ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తరువాత పుతిన్ కాఫీ తాగుతారు. పుతిన్ తీసుకునే ఆహారం పాట్రియార్క్ కిరిల్ అనే ఆధ్యాత్మిక వేత్తకు చెందిన ఫార్మ్‌ల్యాండ్ స్టేట్ నుంచి వస్తుంది.

- Advertisement -