- Advertisement -
నేడు భారత్ కు రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని నరేంద్ర మోదీతో 21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు పుతిన్.సాయంత్రం గం.5.30లకు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సదస్సు జరగనుంది.
కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.మొదట విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయిలో జరగనున్నాయి చర్చలు. కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ & అంతర్జాతీయ అంశాలు, అఫ్గానిస్థాన్ పరిస్థితులు, లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ల నుంచి పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై చర్చించనున్నారు.
- Advertisement -