దుమ్మురేపిన మ్యూజికల్ మస్తీ

52
mla
- Advertisement -

శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా వి.కే.ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన స్వరా మాన్ సూన్ మ్యూజికల్ మస్తీ విజయవంతంగా జరిగింది..సీనిగాయకులైనటువంటి రాహుల్ సిప్లిగంజ్ ,గీతామాధురి,ధామిని, అరుణ్ కౌండిన్య, సింహా తమ హుషారైన పాటలతో యువతను హోరెత్తించారు వీరి పాటలకు ముగ్ధులైన ప్రేక్షకులు హుషారుగా నృత్యాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి శాసనసభ సభ్యులు అరికేపూడి గాంధీ , వర్ఛూసా లైఫ్ స్పేసేస్ అధినేత వి.వెంకటేశ్వర్లు మరియు ఎస్పైర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మందలపు శివకృష్ణ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ మేకింగ్ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకుగాను వి.కే.ఎంటర్టైన్మెంట్స్ వారి తదుపరి కార్యక్రమం అయినటువంటి ఫిల్మ్ కంటెంట్ కాంటెస్ట్ F.C.C నూతన పోస్టర్ ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు…ఈ సందర్భంగా వి.కే.ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులైనటువంటి వినయ్ మరియు తేజశ్వి లు కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మరియు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -