బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి మొదలు మాజీ సీఎంలు జయలలిత,ఎన్టీఆర్,వైఎస్‌ఆర్,తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ రానుండగా ఇందులో మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు.
తాజాగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా, నరేంద్రమోడీ నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దేశ భక్తే నా శక్తి అనే క్యాప్షన్ ఇచ్చారు.
హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం విశేషం. 23 భాషల్లో నరేంద్రమోడీ బయోపిక్ విడుదల కానుంది. ఈ నెల 15నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుండగా ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్‌సింగ్ నిర్మిస్తున్నారు.