మోదీ పాత్రలో వివేక్ ఓబేరాయ్..!

334
- Advertisement -

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం చంద్ర బాబు, కేసీఆర్‌, ఎన్టీఆర్‌ల మీద సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే, ఇక తమిళంలో జయ లలిత మీద చిత్రం తెరకెక్కనుంది. అలాగే బాలీవుడ్‌ విషయానికొస్తే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద కూడా ఓ మూవీ రూపోందుతుంది. ఈ చిత్రం ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ ’ పేరుతో విడుదల కానుంది.

ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర్క్ గ‌త ఏడాదిన్న‌ర నుండి జ‌రుగుతుంద‌ట‌. స్క్రిప్ట్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే త‌దిత‌ర అంశాల‌పై ఒమంగ్ కుమార్ టీం భారీ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అధికారుల నుండి అనుమతి రాగానే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌నే ఆలోచ‌న‌లో టీం ఉంది.

Vivek Oberoi

అయితే బ‌యోపిక్‌లో ప్ర‌ధాని మోదీ పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. నార్త్‌తో పాటు సౌత్‌లోను క్రేజ్ పెంచుకున్న వివేక్ ఒబేరాయ్ అయితే చిత్రానికి దేశ‌మంత‌టా ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. వివేక్ ఓబేరాయ్ రీసెంట్‌గా తెలుగులో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించినున్నారు. ప్రస్తుతం మోడీ బయోపిక్‌ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -