జ‌న‌వ‌రి 1న నాని ‘జెర్సీ’ ఫ‌స్ట్ లుక్..

246
nani jersey
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ళ్ళీరావా చిత్ర‌ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమూవీలో నాని అర్జున్ అనే క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగా ఆయ‌న ప్ర‌ముఖ క్రికెట‌ర్ వ‌ద్ద కోచింగ్ కూడా తీసుకున్న‌ట్లు స‌మాచారం.

nani jersey poster

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను జ‌న‌వ‌రి 1న తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. తమిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ర‌విచంద్ర‌న్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో, నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.

ఎప్రిల్ 2019లో ఈమూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. నాని, నాగార్జున క‌లిసి న‌టించిన సినిమా దేవదాస్ అంత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌క‌పోవ‌డంతో ఎలాగైనా ఈమూవీతో హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు నాని. ఈచిత్రం త‌ర్వాత నాని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం.

- Advertisement -