మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయంతో జోష్‌లో ఉన్న రవితేజ.. తన తదుపరి చిత్రంలో సరికొత్త జానర్‌ను టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు యాక్షన్, కామెడీ, మాస్ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన మాస్ రాజా.. తొలిసారిగా ఫుల్ లెంగ్త్ హారర్ కామెడీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
వివేక్ ఆత్రేయ తన సినిమాల్లో ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే, వినూత్నమైన కథనం, కామెడీని మిళితం చేసే విధానంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను కలిపి రవితేజ కోసం ఆయన ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలో రవితేజ పాత్ర కూడా గత చిత్రాలకు భిన్నంగా ఉండే అవకాశముందని టాక్.
ఈ సినిమాను దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

