అందుకే బౌద్దమతం స్వీకరించా…

296
Vivegam isn’t your usual Ajith film
- Advertisement -

సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రయోగాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. కమల్ వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్, అక్షర్ హాసన్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే శృతి తానేంటో నిరూపించుకుని ఇండస్ట్రీలో ముందుకు వెళుతుండగా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన అక్షర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Vivegam isn’t your usual Ajith film
తాజాగా వివేగం చిత్రంతో అజిత్ సరసన నటిస్తున్న అక్షర చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆమె తన అక్కయ్య శ్రుతిహాసన్ లానే తనకూ కూడా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్ధమతం స్వీకరించానని  చెప్పింది. సినిమాల గురించి ప్రస్తావిస్తూ, తనకు చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి ఉందని, ముంబైలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది.

తన కుటుంబానికి చెందిన వాళ్లు, బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారని, వాళ్లందరితో కలిసి ఓ సినిమా చేయాలనేది తన కోరిక అని చెప్పిన అక్షర, డైరెక్టర్ గా తాను విజయం సాధించిన తర్వాతే తన అమ్మానాన్న, అక్కతో ఓ సినిమా నిర్మిస్తానని చెప్పింది. ఇక, తన తండ్రి కమల్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై ప్రశ్నించగా, ఆయన ఇష్టమని, దాని గురించి తాను మాట్లాడనని చెప్పింది.

- Advertisement -