నిరాశపర్చిన విశ్వనాథన్ ఆనంద్…

236
anand
- Advertisement -

భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ క్రీడాభిమానులను నిరాశపర్చాడు. లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్​లైన్ టోర్నమెంట్‌లో ఓటమిపాలై అందరిని నిరాశపర్చాడు.

మొత్తం తొమ్మిది రౌండ్లలో ఎనిమిదింట ఓడి, పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానానికి(9) పరిమితమయ్యాడు. టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్​లో విశ్వనాథన్​.. వాసిల్​ ఇవాంచుక్(ఉక్రెయిన్​) చేతిలో పరాజయం పాలయ్యాడు.

పాయింట్ల పట్టికలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్​ మాగ్నస్ కార్ల్​సన్​(నార్వే​, 25పాయింట్లు) టాప్​లో ఉండగా కార్ల్​సన్​తో పాటు పీటర్ స్విడ్లర్(రష్యా)​, అనిశ్ గిరి(హంగేరీ), ఇయాన్​ నిపోమ్​నియాచి(రష్యా) సెమీ ఫైనల్​కు చేరారు.

- Advertisement -