హాలీవుడ్‌ రేంజ్‌లో కమల్‌ మూవీ ట్రైలర్..

189
- Advertisement -

కమలహాసన్ హీరోగా తన డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం విశ్వరూపం 2. విశ్వరూపం సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నారు. తాజాగా విశ్వరూపం 2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించగా.. తెలుగులో డబ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో .. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Vishwaroopam 2 Telugu Movi Trailer

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో వున్నాయనే టాక్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. ‘విశ్వరూపం’ కథను ఎక్కడైతే ఆపేశారో .. అక్కడి నుంచే ‘విశ్వరూపం 2’ మొదలవుతుందని కమల్ చెప్పారు. మొదటి భాగాన్ని అప్పట్లో వివాదాలు చిక్కుకున్న కారణంగా, రెండవభాగంలో ఎలాంటి వివాదాలు లేకుండా సినిమాను పూర్తి చేశామని కమల్ తెలిపారు.

- Advertisement -