ఢిల్లీలో సీఎం కేసీఆర్…

274
kcr

విభజన సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం…ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. కొత్త జోనల్ విధానాన్ని అమోదించాలని కొరడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నారు.

కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా కొత్త నియామకాలు చేపట్టడం,31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం,స్ధానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వంటి వాటిని వివరించనున్నారు. దీని ద్వారా తెలంగాణ యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని వివరించనున్నారు.

జోనల్ వ్యవస్థపై అధికారులతో మాట్లాడేందుకు.. మూడు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ. ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయ, హోంశాఖ సానుకూలంగా స్పందించాయి. ఫైల్ ప్రధాని కార్యాలయంలో ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.