భారీ వసూళ్లను రాబడుతున్న ‘విశ్వరూపం 2’..

225
- Advertisement -

తమిళ సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

Vishwaroopam 2

గతంలో వచ్చిన ‘విశ్వరూపం’ ఘన విజయాన్ని సాధించడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కమల్ అద్భుత నట విన్యాసం ఈ సినిమాకి హైలైట్ గా నిలవగా, పూజా కుమార్ .. ఆండ్రియా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక చెన్నైలో ఈ మూవీ మొదటి రోజున అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది. చెన్నైలో తొలిరోజున 92 లక్షలు రాబట్టి, ఈ ఏడాది ఇంతవరకూ వచ్చిన చిత్రాలలో ఉత్తమమైన వసూళ్లను సాధించిందని అంటున్నారు. చెన్నై నగరంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచినట్టు చెబుతున్నారు. అమెరికా .. ఆస్ట్రేలియాలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

- Advertisement -