గ్రాండ్‌గా సోల్ జిమ్ రీలాంచ్..

215
- Advertisement -

సెలూన్, స్పా, జిమ్ విభాగంలో సోల్ జిమ్ సెంటర్‌కు ఎంతటి పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సోల్ జిమ్ రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ రీ లాంచ్ ఈవెంట్‌కు మిసెస్ యూనివర్స్ 2017, సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కోచ్ అభిమానిక, హ్యాష్ ట్యాగ్ మార్కెటింగ్ ఫౌండర్, ది హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఫెస్టివర్ పార్ట్‌నర్ గుల్నర్ విర్క్ మరియు మోడల్ అండ్‌ ఫిలింస్టార్ వర్ధన్ హాజరయ్యారు.

Soul Gym was Relaunched

ఈ సందర్భంగా సోల్ మేనేజింగ్ పార్ట్ నర్ షీతల్ బంగుర్ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ రోడ్.నెం.36లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన సోల్ జిమ్‌లో ఫిట్‌నెస్, వెల్‌నెస్, బ్యూటీకి సంబంధించిన సేవలు ఒకే దగ్గర ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రీమియం సేవల్ని ఇక్కడ అందించనున్నాం. బేగంపేట, బంజారా హిల్స్, మాదాపూర్ లో సోల్ జిమ్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాం. త్వరలోనే ఫిలింనగర్‌లో కూడా సోల్ జిమ్ అందుబాటులోకి రానుంది.

Soul Gym

సెలూన్, స్పా, జిమ్ విభాగంలో సోల్ జిమ్ కు ప్రత్యేకమైన పేరుంది. ఇప్పుడు రీ లాంచ్‌తో మరిన్ని అత్యాధునిక సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. సోల్ జిమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. వినియోగదారుల ఆరోగ్యాన్ని, అందాన్ని మరింత మెరుగు పరిచే విధంగా ఇక్కడ సేవలుంటాయని ధీమాగా చెప్పగలం. దీనికోసం ఏంతో నైపుణ్యం ఉన్న ట్రైనర్స్ అందుబాటులో ఉంటారు. అని అన్నారు.

- Advertisement -